02 June 2010

సన్న జాజి చెట్టుకింద సలవా సలవా చిన్నమ్మ కెందుకింత గొడవా

సన్న జాజి చెట్టుకింద సలవా సలవా చిన్నమ్మ కెందుకింత గొడవా..||౨||
దాని వయ్యారి రూపమెంత నడవా... అది గోదారి మీద గూటి పడవా..
దాని తోడుంటే నాకు ఏం తక్కువా...

ఓ ఓ సన్న జాజి చెట్టుకింద సలవా సలవా చిన్నాడిచేతికేమో చొరవా ||౨||
వాడి ముద్దుకుంది ముత్యమంత విలువా.. వాడు ఉంటడమ్మ గుండె లోన నిలవా..
వాడి కౌగిళ్ళకుంది ఎంత మక్కువా...

సందేళ నింగి లోన చుక్క పొడిచీ..దాని సందిళ్ళలోన ఈడు నిక్క పొడిచి.
పిల్ల గాలి పైట లాగి పక్క పరిచి ఆహ లేత ఎండ దాని మీద పూలు పరచి
దాని సోకు చూడగానే మైమరచి నీడలాగ వెంట పడి పోదలచి..
అందాలు ఇచ్చుకుంట ఆకు మడిచి ఓయ్ సందేళ కొచ్చి పోర మామా..
అరె గున్నమావి తోట లోకి కన్నెపిల్ల రావె..

||సన్న జాజి||

కాశ్మీరు లోయ వంటి కన్నె సొగసు కవ్వించ పూలు జల్లె ఉన్న వయసు
కన్యా కుమారి మీద నాకు మనసు కంటి పాపాయి ఏమందో నాకు తెలుసు.
మంచు పూల పందిరేసె మాఘ మాసం మాపటేళ కొచ్చాను నీకోసం..
ఓయ్ నల్లమబ్బు చీకటొచ్చె మనకోసం..నాటాలి ముద్దుతో సందేశం
అరె కంచె దాటి పోయింది చేనుకూడ మామ..

||సన్న జాజి||

No comments: