14 June 2010

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ
సుడిలో పడవై ఎపుడూ తడబడకూ
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవనీ నీ కళ్ళు
కన్నఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
చలో చలో

నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడ్లో చిచ్చల్లే రగిలించె నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదా
నీలా నవ్వే క్షణాలలో

చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసీ
తొక్కే కాళ్ళే మొక్కేవాళ్లై దైవం అనరా శిలను కొలిచీ
అమృతమే నువు పొందూ విషమైతే అది నావంతూ
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచీ నీ ఎదలో ఒదిగే వరకూ
చలో చలో

No comments: