04 June 2010

హేయ్...... అనాదిగా అదే కధ..... అయినామరి కొత్తేకదా.....

||పల్లవి||
హేయ్...... అనాదిగా అదే కధ..... అయినామరి కొత్తేకదా.....
ప్రేమే కదా.......
ఒక ఉగాదిలా వచ్చేనుగా....... రుచులెన్నో తెచ్చేకధ.....
ప్రేమే కదా.......
కలిసే మనసులలో..... అర విరిసే కన్నులలొ ఈ ప్రేమే కదా.....
మహ మాయే కదా.......
తరిమే తలపులలో...... వల విసిరే వలపులలో ఈ ప్రేమే కదా.....
మహ మాయే కదా....... ||అనాదిగా||

||చరణం 1||
అంతా ఆనందం నువ్వుంటే నా కంటిముందు
ఎంతో సంతోషం నీ తోడు ఉండగా
గారం సహకారం మమకారం నువు వెంటరాగ
అంతా నా సొంతం నీ ప్రేమ ఉండగా
ఎదురుగ నువ్వే నుంచుంటే ఎదలోన పరవశం
నిముషము నువ్వే లేకుంటే ఎనలేని కలరవం ||అనాదిగా||

||చరణం 2||
ఇంట్లో మరి గుళ్ళో నే వెళ్ళే ప్రతిదారిలోన
ఎదలో దేవతలా నా చెలియ రూపమే
అంతా మనసంతా అయ్యింది మురిపాలపుంత
వింతే పులకింతే ఈ కొత్త భావమే
ఎవరిని యెపుడు కలిపేనో ఈ ఇంద్రజాలము
మనసున మనసై ముడివేసే ఈ ప్రేమ గాలము ||అనాదిగా||

No comments: