03 June 2010

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతొటల్లో

ఆ...ఆ..

రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతోటల్లో
కోకిలమ్మను కూయమంటూ మల్లెవీణను మీటమంటూ
కల్యాణి రాగాల వర్ణాలలో

నీ పాటా తేట తేట తెనుగు పాట చల్లలమ్మ చద్దిమూట
అన్నమయ్య కీర్తనల అనందకేళిలా
నీ పాటా గడుసుపిల్ల జారుపైట గండుమల్లె పూలతోట
పల్లెటూరి బృందావనాల సారంగలీలలా
చిరుమబ్బుల దుప్పటిలో ముసుగెత్తిన జాబిలిలా
నునువెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా
కోడి కూసే వేళదాక ఉండిపోతే మేలు అంటూ
గారాల బేరాలు కానిమ్మంటూ
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతొటల్లో


ఉయ్యాలా ఊపి చూడు సందెవేళా పిల్లగాలి శోభనాల
కొండ నుంచి కోన ఒడికి జారేటి వాగులా
జంపాల జామురాతిరైన వేళ జాజిపూల జవ్వనాల
జంటకోరి జాణ పాడే జావళీ పాటలా
గోపెమ్మలు కలలు కనే గోవిందుని అందములా
రేపల్లెకి ఊపిరిగా రవళించిన వేణువు చందములా
హాయిరాగం తీయమంటూ మాయ చేసి వెళ్ళమంటూ
రాగాల తానాలు కానిమ్మంటూ
రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపిందెవరే పూలతొటల్లో

No comments: