02 June 2010

ప్రేమ వనరాణి కన్నె అలివేణి వచ్చెనే ఓ..

ప్రేమ వనరాణి కన్నె అలివేణి వచ్చెనే ఓ..
తేనెపొదరింట పూల గంధాలు పంచెనే
చిరుగాలై లాలించెనే
మౌనం పల్లవిగా అనురాగం ఊపిరిగా
నాకైవేచిన రాణివే నా ఆశలదేవతవే..

గగనం భువనం చెలి ఒడిలో ఒదిగే
ఉదయం హృదయం తన కుశలం అడిగే
ఓ..దేహం తగిలి సుమదాహం ముదిరే
వయసే వరదై ఎద ఇలనే మరిచే
నీ శ్వాసనై తరియించని నీ గానమై పులకించనీ ...
ఆశపరదాలు తీసి ఒడిలోన ఒదగనీ
లేత పరువాలు కరిగి విరహాలు కరగనీ
నీలోనే దాగుండనీ


మదనా అధరం మధువనిలా మారే
ఆ మధువే చినుకై నీ ఒడిలో వాలె
ఓ..విరిసే కుసుమం ప్రియ సఖునే పిలిచే
కవ్వించే మధుపం నెచ్చెలినే చేరే
నీ వీణ నేనై రవళించనీ నీ ఊహలోనే నిదురించనీ...
స్వప్న సుందరుడు నన్ను దరిచేర వచ్చెనే
ప్రేమ పొదరింట పూల గంధాలు పంచెనే
ఆ..పూమాలై లాలించెనే
మౌనం పల్లవిగా అనురాగం ఊపిరిగా
నాకై వేచిన రాణివే నా ఆశల దేవతవే ...

No comments: