04 June 2010

ఏ నోము నోచిందొ...... ఏ పూజ చేసిందొ

||పల్లవి||
ఏ నోము నోచిందొ...... ఏ పూజ చేసిందొ
పరమేశ నీ వరము పొంది.......
మురిసింది ఈ కన్న తల్లి........
తన శ్వాసతో బంధమల్లి......... ||ఏ నోము||

||చరణం 1||
నువ్వే ఇచ్చినా...... బిడ్డే దూరమై.....మోడైమిగిలే ఈ తల్లి పరమేశా....
తల్లీ కళ్ళలో...... పొంగే గంగతో..... గుండే తడిసిపోలేద జగదీశా.......
ఇటువంటి తల్లి..... నీకుంటె ఈశా......
తెలిసేది నీకు ఈ తల్లి ఘోష
నీ కన్ను అది చూడదా......
ఈ కంటి తడి ఆరదా.......... ||ఏ నోము||

||చరణం 2||
గుండే గొంతుగా...... అమ్మా అనే.... మాటే తనకు చాలయ్య మహదేవా.....
తానే నేస్తమై..... తోడై పెంచిన...... తల్లి కొడుకునోసారి కలిపేవా....
చనుబాల తీపి....... తెలిసుంటె ఈశా......
కనుగొందువేమో...... ఈ పేగు భాష
చెప్పమ్మ నువు పార్వతి........
తల్లంటె ఓ ఆరతి......... ||ఏ నోము||

No comments: