02 June 2010

పాడలేను పల్లవైన భాషరాని దానను

పాడలేను పల్లవైన భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను ||2||
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం ..పైరగాలే మేళం
మమతే రాగం..శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా ...ఆ..ఆ...
రాగమే లోకమంతా కష్టసుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా

||పాడలేను||

రాగనిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగి పోదా
ఏ ప్రాణమైనా తనివితీరిపోదా
చెపేది తప్పో ఒప్పో..ఒ..ఒ..
చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే
అహూ..ఉహూ..రోకటి పాటలో లేదా మధుర సంగీతం
అహూ..ఉహూ..రోకటి పాటలో లేదా మధుర సంగీతం



పాడలేను పల్లవైన భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా

మ ప ద మ పాడలేను పల్లవైనా
స.రి.గమ పదమ పాడలేను పల్లవైన
పదనిస నిదమగ సరి పాడలేను పల్లవైన
సస రిగసరిగమగస పదమ
మమ పద మప దని ద మప దని..
పదనిసరిగ సనిదమ పదనిస
నిదపద నిదమప దమగమ పదమగ మగస
సా.సస సా.సస సా.స సరిగమ గమగసనిద
మా.మమ మా.మమ మా.మ పదనిస నిసనిదమగ
సస రిరి గగ మమ పప దద నిని సస
నిససస నినిదనిద..
మపదని దని దదమా
గమగ సరిగమ గమపద మపదని
సరిగమ గమసనిదమగ

మరిమరి నిన్నే మొరలిడ నీ మనసున దయ రాదూ..
మరిమరి నిన్నే మొరలిడ నీ మనసున దయ రాదూ..
మరి మరి నిన్నే మరి మరి నిన్నే

No comments: