04 June 2010

ఒక స్నేహమే..మము కలిపే

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బ౦ధమే... విరబూసే
స౦తోషమే.. మది ని౦డే
నవలోకమే.. పిలిచి౦దే
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

ధ్యేయ౦ ధ్యాన౦ ఒకటై సాగే..
లక్ష్య౦ గమ్య౦ ఒకటై ఆడే..
ఒక చెలిమి కోస౦ వేచే క్షణ౦
ఒక చెలియ కోస౦ జరిపే రణ౦
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో

స్నేహ౦ ప్రేమై మారే వైన౦..
జతగా కలిసి చేసే పయన౦..
ఒక నవ్వు కోస౦ ఓ స౦బర౦
ఒక మెప్పు కోస౦ పెను సాహస౦

హృదయ౦ లోన మెరిసే స్వప్న౦
ప్రణయ౦ వరమై తెలిపే సత్య౦
ఎదగదుల పైన ఓ స౦తక౦
మది నదులు కలిపే ఈ స౦గమ౦
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

No comments: