07 June 2010

జీవనవాహిని...... ఆమని

ఓం...... ఓం...... ఓం...... ఓం......
జీవనవాహిని...... ఆమని
కలియుగమున కల్పతరువు నీడనీవని
కనులుతుడుచు కామధేను తోడునీవని
వరములిచ్చి భయముదీర్చి శుభముగూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకలలోక పావని
భువిని తడిపి దివిగ మలచి సుడులుతిరుగు శుభగాత్రి
గంగోత్రి...... గంగోత్రి
గంగోత్రి...... గంగోత్రి
గల గల గల గంగోత్రి..... హిమగిరి దరి హరిపుత్రి
గల గల గల గంగోత్రి..... హిమగిరి దరి హరిపుత్రి

మంచుకొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజావాహిని
విష్ణు చరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి
గంగోత్రి...... గంగోత్రి
గంగోత్రి...... గంగోత్రి
గల గల గల గంగోత్రి..... హిమగిరి దరి హరిపుత్రి
గల గల గల గంగోత్రి..... హిమగిరి దరి హరిపుత్రి

పసుపు కుంకుమతో పాలు పన్నీటితో
శ్రీగంధపు ధారతో పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న అభ్యంగన స్నానం
అమ్మా గంగమ్మా......
కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించద్దని
యమునకు చెప్పమ్మా సాయమునకు వెనకాడద్దని
గోదారికి కావేరికి ఏటి సెలయేటికి
కురిసేటి జడివానకి దూకే జలపాతానికి నీ తోబుట్టువులందరికి
చెప్పమ్మా మా గంగమ్మా.....
జీవ నదివిగా ఒక మోక్షనిధివిగా పండ్లు పూలు పసుపుల పారాణి రాణిగా
శివుని జటనమే తన నాట్య జతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జనని గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ
గంగోత్రి...... గంగోత్రి
గంగోత్రి...... గంగోత్రి
గల గల గల గంగోత్రి..... హిమగిరి దరి హరిపుత్రి
గల గల గల గంగోత్రి..... హిమగిరి దరి హరిపుత్రి

No comments: