సిందూర పువ్వా తేనే చిందించ రావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా
కలలే విరిసేనే .. కధలే పాడెనే
ఒక నది వోలె ఆనందం ఎద పొంగెనే
వో...సిందూర పువ్వా తేనే చిందించ రావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా
ఓ ఓ ఓ .. ఓ ఓ.. ఓ ..ఓ
ఉమ్ ఉమ్ .. ఓహో ఓ ఓ ఓ
కమ్మని ఊహలు కళలకు అందం వీడని బంధం కాదా
గారాలు వెన్నెల కాసే సరాగాలు తేలి ..
కమ్మని ఊహలు కళలకు అందం వీడని బంధం కాదా
గారాలు వెన్నెల కాసే సరాగాలు తేలి ..
అనురాగం సందడి చేసే రాగాలనేలి ..
సిందూర పువ్వా తేనే చిందించ రావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా
మాటల చాటున నాదం నువ్వే .. తీయని పాట నేనే..
ముదుమాస ఉల్లాసాలే పలికించేనే
మాటల చాటున నాదం నువ్వే .. తీయని పాట నేనే..
ముదుమాస ఉల్లాసాలే పలికించేనే
మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే
సిందూర పువ్వా తేనే చిందించ రావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా
అలలై పొంగే ఆశలతోటి ఊయల ఊగే వేళా
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
అలలై పొంగే ఆశలతోటి ఊయల ఊగే వేళా
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
రాగాలూ ఆలపించి పిలిచావు నన్నే
సిందూర పువ్వా తేనే చిందించ రావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా
No comments:
Post a Comment