నీ చరణం కమలం మ్రుదులమ్
నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలె రస వేదాలు
నను కరిగించే నవ నాదాలు
అవి ఎదలొ ఉంచిన చాలు
ఏడేడు జన్మాలు
ఆ ఆ ఆ ఆ ||నీ చరణం
౧|| మువ్వలు పలికే మూగతనం లో
మోము న మోహన రాగాలు
కన్నులు పలికే కలికి తనం లో
చూపుల సంధ్యా రాగాలు
అంగ అంగమున అంద చందములు
వొంపు వొంపున హంపి సిల్పములు
ఎదుటే నిల్చిన చాలు...
ఆరారు కాలాలు.. ||నీ చరణం
౨|| జతులే పలికే జాన తనం లో
జారే పైటల కెరటాలు
శ్రుతులే కలిసే రాగ తనం లో
పల్లవించినా పరువాలు ||జతులే
అడుగు అడుగునా రంగ వల్లికలు
పెదవి అడుగునా రాగ మాలికలు
ఎదురై పిలిచిన చాలు.....ఊ ఊ
నీ మౌన గీతాలూ ఊ ఊ ఊ ||నీ చరణం
No comments:
Post a Comment