21 July 2010

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ --Aadadhe Aadharam

పల్లవి:

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం
నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం

చరణం1:

అవని అందము కుదురులేనిది
ఏడాదికొక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మాయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగ వెల్లువ
సొగసు పొంగులో ఈమె సాటివా
వయ్యరి వంపులు నీ ఒంటికున్నవా

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం
నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం

చరణం2:

కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువు తెల్లబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో అంత మైకమా
చిరుగాలి నువ్వలా స్తంభించిపోకుమా
చెలియ తనువులో వేడి తాకితే
చలికి వణకవా సూర్యబింబమా
ఆ మంచు మంటతో జాబిలిగ మారవా

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం
నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం సంబరం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips