14 July 2010

నిన్నే కోరిన చిన్నది

నిన్నే కోరిన చిన్నది
నీ ఒడిలోనే ఉన్నది
మంచికి గానీ చెడ్డకి గానీ
నిన్నే నమ్ముకున్నది
ఆ చిన్నది ఏమన్నది?
మేడలు,మిద్దెలు
చీరలు, నగలు
వద్దు వద్దు నాకన్నది
యిద్దరి మనసులు ఏకం అయితే
అదియే పదివేలన్నది ||నిన్నే||
ఒళ్లు వొంచి నీవు శ్రమ పడుతుంటే
సాయం చేస్తానన్నది
నీతో ఆటలు నీతో పాటలు
అదియే స్వర్గం అన్నది ||నిన్నే||
నీవే సూర్యుడు తానే తామర
పూవై నిలిచా మన్నది
కీడు తలంచే చీడపురుగులను
దూరం చేస్తానన్నది
కడు దూరం చేస్తానన్నది ||నిన్నే||

No comments: