14 July 2010

ఎవడైన తెగియించి యెదిరించెనా నన్ను

ఎవడైన తెగియించి యెదిరించెనా నన్ను
యీ కరాసికి బలియిచ్చినాను
ఉర్వీతలము పైన యుద్దాలు సృష్టించి
దేశాన శాంతి సాధించినాను
ప్రజల క్షేమమునకై పన్నులు హెచ్చించి
చెరసాలకై ఖర్చు చేసినాను

ప్రజల బిడ్డలరీతి భావించవలె గాన
విరగదన్నుచు బుద్ది గరపినాను
అట్టి వీరాధివీరుడనైన నేను
బ్రతికియున్నాడ గజదొంగ భయమదేల
దిట్టముగ వాని బంధించి తెండు ఊ పొండు
చీల్చి చెండాడివైతు నా చెనటి నిపుడే

No comments: