20 July 2010

నెయ్యములల్లో నేరేళ్ళో

నెయ్యములల్లో నేరేళ్ళో
వొయ్యన యూరెడి వువ్విళ్ళో ||2||
నెయ్యములల్లో నే..రే..ళ్ళో

పలుచని చెమటల బాహు మూలముల-
చెలమలలో నా చెలువములే ||2||
తళతళ మను ముత్యపు చెఱగు సురటి
దులిపెడి నీళ్ళ తుంపిళ్ళో

||నెయ్యములల్లో||

తొటతొట కన్నుల దొరిగెడి నీళ్ళ
చిటిపొటి అలుకలు చిరు నగవే ||2||
వటఫలంబు నీ వన్నెల మోవికీ..ఆ..
వటఫలంబు నీ వన్నెల మోవికీ
గుటుకలలో నా గ్రుక్కిళ్ళో

||నెయ్యములల్లో||

గరగరికల వేంకటపతి కౌగిట..వేంకటపతి కౌగిట
గరగరికల వేంకటపతి కౌగిట
పరిమళములలో బచ్చనలు ||2||
మరుని వింటి కమ్మనియంప విరుల-
గురి తాకు ఇనుప గుగ్గిళ్ళో

||నెయ్యములల్లో||

1 comment:

ప్రణవ్ said...

నాగేశ్వరరావు గారూ,
అద్భుతమైన పాట. సాహిత్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips