20 July 2010

ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక

పల్లవి

ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక
నీ తలుపుతోనె బ్రతుకుతున్నా . . .
నీ తలపుతోనె ప్రియా . . .

చరణం 1

నీ చేతిగాలులను నేనడిగాను నీకుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
అనుక్షణం నామనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీకధలే
కనులకు నిదురలే కరువాయె ||ప్రియా||

చరణం 2

కోవెలలో కోరితిని నీదరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దయినా అందించదా
నినుగాక నీకలని పెదవంటుకోదా
వలపులు నీదరి చేరుటిలా
ఊహల పడవలే చేర్చునులే ||ప్రియా||

No comments: