21 July 2010

నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్య

పల్లవి:

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వంతెన వేసిన దేవుడు నీవే చినరాయుడు నీవే
నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

చరణం1:

గాలిలోన తేలే పరువాల పూలకొమ్మ
నేలవాలిపోగా చివురింపచేసినావే
పసుపుతాడుమీద లోకానికున్న ప్రేమ
మనిషి మీద లేదు ఈ నీతికెవరు బ్రహ్మ
తప్పవురా హేళనలు వేదనలే నీ హితులు
గుండెకు బండకు వారధికట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

చరణం2:

నీటిలోని చేప కన్నీరు ఎవరికెరుక
గూటిలోని చిలుక గుబులేదొ ఎవరికెరుక
నుదిటిమీద రాత వేరెవరు మార్చగలరు
న్యాయమూర్తి నీవే తీర్పెవరు తీర్చగలరు
ఒంటరిది నీ పయనం నిబ్బరమే నీకభయం
తప్పుకి ఒప్పుకి గంతలు కట్టిన
దేవుడి లీల ఇది కాకుల గోల

నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య
ముచ్చటగా ఒక తాళి కట్టి
నింగికి నేలకు నిచ్చెన వంతెన వేసిన దేవుడు నీవే చినరాయుడు నీవే
నిండు ఆకాశమంత మనసువున్న రాజువయ్య
పండువెన్నెల లాంటి చల్లని చూపుల రేడువయ్య

No comments: