02 July 2010

జై జై గణేషా......

||పల్లవి||
జై జై గణేషా......జై కొడతా గణేషా.....జయములివ్వు బొజ్జ గణేషా.......
హై హై గణేషా.......అడిగేస్తా గణేషా.....అభయములివ్వు బుజ్జి గణేషా......
లొకం నలువైపులా లేదయ్య కులాసా.......దేశం పలువైపులా ఏదో రభస......
మొసం జన సంఖ్యలా పెరిగింది హమేషా.....పాపం హిమ గిరులుగా పెరిగెను తెలుసా....
చిట్టి యెలుకను ఎక్కి...గట్టి కుడుములు మెక్కి.....
చిక్కు విడిపించగ, నడిపించగ చెయ్యి తమాషా........

||ఛరణం 1||
నందేమో నాన్నకి, సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా.....
ఎలకేమో తంబి కి, నెమలేమో తమరికి రథమల్లే మారలేదా........
పలుజాతుల భిన్నత్వం మీలో ఉన్నా.....కలిసుంటూ ఏకత్వం బొధిస్తున్నా....
ఎందుకు మాకీ హింసా వాదం........ఎదిగేటందుకు అది ఆటంకం......
నెర్పర మాకు సొదరభావం.........మాలో మాకు కలిగేలా ఇవ్వు భరోసా.......

||ఛరణం 2||
దందాలను అడిగిన దాదాలను దండిగా దంతంతో దంచవయ్యా.......
లంచాలను మరిగిన నాయకులను నేరుగా తొండంతో తొక్కవయ్యా......
ఆ చుక్కల దారుల్లొ వస్తూ వస్తూ.....మా సరుకుల ధరలన్ని దించాలయ్యా.....
మాలో చెడునే దించాలయ్యా.......లోలో అహమే వంచాలయ్యా.......
నీలో తెలివే పంచాలయ్యా.....ఇంతకు మించి కోరెందుకు లేదు దురాశా.........

No comments: