02 July 2010

హే జాణా..... హే హే జాణా........

||పల్లవి||
హే జాణా..... హే హే జాణా........
హే జాణా..... హే హే జాణా........అందమే ఎంతున్నా.......
హే జాణా..... హే హే జాణా........దాచుకో కొంతైనా
చీరకడితే సింగారం.......ఓణి చుడితే వయ్యారం
పొట్టిబట్టలు కట్టావో.........బట్టబయలే బండారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం........ గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం......చీకట్లొ చెయ్యకు సంచారం ||హే జాణా||

||చరణం 1||
ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందమూ మేమేగా.......
ఆ అల్లరి ఆ అలజడి అన్నింటిలో మేమేగా.......
అ అంటే అమ్మాయి...... అపురూపం మీరోయి.......
అపహాస్యంగా మారొద్దుగా........
జబ్బపైన టాటూలు.......జామురాతిరి పార్టిలు.........
కట్టుబాట్లకు వీడ్కోలు...... కన్నవాళ్ళకు కన్నీళ్ళు.......
గుమ్ము గుమ్మెత్తే ఆకారం........ గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం......చీకట్లొ చెయ్యకు సంచారం ||హే జాణా||

||చరణం 2||
మా ఆశలు మా ఊహలు హైరేంజిలో ఉంటాయి...........
ఎంతెత్తుకి మీరెదిగినా ఈ నేలనే చూడాలి........
వేగంగా పరుగెత్తే కాలంతో కదలందే థ్రిల్లేముంది టీనేజికి.......
నెట్టులోన ఛాటింగు..........పార్కులోన బీటింగు
మార్చుకో నీ థింకింగు.......చేసిచూపు సంథింగు
గుమ్ము గుమ్మెత్తే ఆకారం........ గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం......చీకట్లొ చెయ్యకు సంచారం ||హే జాణా||

No comments: