20 July 2010

నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమ వేదం

పల్లవి

నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమ వేదం
ఆశలే బాసలై కలలుగనే పసి మనసులై
కవితలు పాడి . . . కవ్వించనీ కవ్వించనే కవ్వించనీ

చరణం 1

కళ్ళూకళ్ళూమూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మా ప్రేమా. . .
నిద్దుర చెదిరి పోయెనమ్మ నేస్తంకోసం వెదికేనమ్మా ప్రేమా. . .
ఆడించి పాడించి అనురాగం కురిపించి అలరించేదే ప్రేమ
రమ్మంటూ పొమ్మంటూ పొమ్మంటూ రమ్మంటూ కవ్వించేదె ప్రేమ
ప్రేమలకు హద్దులేదులే దాన్ని ఎవ్వరయినా ఆపలేరులే ||నీపిలుపే||

చరణం 2

జాతిలేదు మతములేదు కట్నాలేది కోరుకోదు ప్రేమా . . .
ఆదిలేదు అంతంలేదు లోకం అంతే తానైయుండును ప్రేమా . . .
ఊరేదో పేరేదో కన్నోల్ల ఊసేదో అడగదు నిన్ను ప్రేమ
నాలోను నీవుండి నీలోను నేనుండి జీవించేదే ప్రేమ
జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలయినా వీడిపోదులే ||నీపిలుపే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips