12 July 2010

వెన్నెలలో మల్లెలలో చిరుగాలి

వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
కురిసెను నాలో వలపుల వాన మనసున మోగే మమతల వీణ
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా

నీలాల గగనాన వేచినదో చిరుతార నేడూ
గారాల నెలవంక తోడుగనే నిలిచింది చూడూ
ఏవేవో తమకాలు సుడి రేగె నాలో కమ్మంగా ఒడి చేరి కరగాలి నీలో
తనువే తపించే క్షణాన
చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా
కురిసెను నాలో వలపుల వాన మనసున మోగే మమతల వీణ
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా

కౌగిళ్ళ ద్వారాలు తియ్యమనే పిలుపందుకున్నా
శృంగార తీరాలు చేరమనే నిను కోరుకున్నా
ఏనాటి కలలన్ని యద చేరినాయో ఎన్నెన్ని జన్మాల తెర తీసినాయో
నీకై జ్వలించే క్షణాన
చిలిపి వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవె సుమా కలకాదు సుమా కురిసెను నాలో వలపుల వాన
మనసున మోగే మమతల వీణ
వెన్నెలలో మల్లెలలో చిరుగాలి సరిగమలో నీవే సుమా కల కాదు సుమా
నీవే సుమా కలకాదు సుమా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips