14 July 2010

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏకంటికైన

పల్లవి

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏకంటికైన
రెప్పల దుప్పటి కప్పేచీకటి చూపించేనా ఏకాంతినైన
నిను నీవే సరిగా కనలేదే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా ఏవో జ్ఞాపకాలు
సుడిదాటి పడలేవా ఎన్నో తీపి సంగతులు రేపు పిలుపు వినవలేవా

చరణం 1

చంద్రుడి ఎదలో మంటని తుమ్మెర అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు కనక కాక్షాలు అడిగి ఎవరైనా
ప్రాణాం ఇనికిపైన అనుమానపడరు ఎపుడైనా ||నిను నీవె సరిగా||

చరణం 2

పోయింది వెతికే వేదనా పొందింది ఎదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకి అలజడి నిలచేదెపుడో
సందేహం కలిగే నదికి కలతను తీర్చేదెవరో
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదో చూపగలిగేనా ||నిను నీవె సరిగా||

No comments: