14 July 2010

అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి

పల్లవి

అంతా నిండిన ప్రేమ ఏది చిరునామా ఎవరికి
తెలిసేనమ్మా ఓహొ ఓహొ ఓహొ ఓహొ
ఎక్కడ పుట్టావమ్మా ఆ ఊరేదమ్మా నువ్వే చాలని ప్రేమ ఓహొ ఓహొ ఓహొ
గుండెలలో దాగినది చెప్పలేక ఆగినది చెప్పేందుకు మాటే ఎలా
వెన్నెలే పండినది కన్నె మనస్సు నిండినది తేటేందుకు ఉన్నదిచాలు
మౌనం లోని ఆ భాషలు ఎన్నో చూపులలోని దాగెను భాసలు ఎన్నో
విప్పేసి చెప్పేస్తే ఇది ఏమి ఉన్నది గుప్పెట్లో అంతా ఉంది
గుట్టు దాగుంటే బాగుంటుంది ||గుండెలలో...||

చరణం 1

కళ్ళే పలికించు మదిలో మాటలను ఇంకా పెదవిప్పే చెప్పాలా
నవ్వే ఉలికించు అవునను సైగలను అయినా వివరించి తెలపాలా
ముఖమంతా కాంతులతో వెలిగేనమ్మా
మనసంతా ఆ వెలుగులో తెలిసేనమ్మా
పెదవుల్లో ఆ మధవే పొంగే వేళ ప్రేమంటు పేరే ఎలా
నువ్వు నేనంటు వేరవ్వాలా ||గుండెలలో...||

చరణం 2

తొలకరి జల్లుల్లో మట్టి సువాసనలు ఎలా వస్తాయో అలాగే
ప్రేమే విరిశాకా ఒంటికి పరిమళము తానై వస్తుంది ఎలాగా
ప్రేమన్నది భాషలకు అసలందదులే మౌనంగా ధ్యానంగా తానుండులే
ఊహలతో నింపేస్తే అది నిలవదులే కలగంటు
పాటలు ఎలా ప్రేమ కలగంటు మాటలు ఎలా ||గుండెలలో...||

No comments: