14 July 2010

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ

పల్లవి

బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మ ||2||
ఎన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఈ బొమ్మ
చెంత చెదరని మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి ఓ . . . ||బంగారం||

చరణం 1

జో . . . లాలి అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ . . . మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని - పొందునట
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంత నవ్వుల నిలవుఓ ||బంగారం||

చరణం 2

అడగక ముందే అన్నీ చేసి సేవకుడవి అనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే - అందించావు
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండెపాడనీ మధురీమ నేర్పావు
నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రాని త్వరలో ఓ . . .
ఓ . . .మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధివో
పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా

No comments: