02 July 2010

నీ ఇల్లు బంగారం గాను........ నా రవ్వల కొండా.......

||పల్లవి||
నీ ఇల్లు బంగారం గాను........ నా రవ్వల కొండా.......
నీ వొళ్ళో బందీనవుతాను......
నీ వొళ్ళు ఉల్లాసం గాను...... నా గవ్వల దండా.....
కౌగిల్లో వందేళ్ళుంటాను......
చిలుకను నేను...... చెరకువి నువ్వు.......
కొరికిన వేళా కాదనకు
పలకను నేను..... బలపం నువ్వు......
కలిసిన వేళ వలపును రాయకుండ వెళ్ళకు ||నీ ఇల్లు||

||చరణం 1||
నీకే అందకపోతే అందం అందం కానే కాదు.....
నీతో ఆడకపోతే ఆటే కాదంట
నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు.....
నీలో ఉండకపోతే నేనే కాదంట
దొరలాగా.... దొరికావు..... నిను దోచుకోక పోను.....
కథలాగా...... కదిలావు...... నిను చదవకుండ వెళ్ళను ||నీ ఇల్లు||

||చరణం 2||
ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని.....
కాలి మువ్వ చెప్పేసింది సవ్వడి చెయ్యనని
చెంపసిగ్గు చెప్పేసింది గుట్టే దాచేస్తానని.....
జారు పైట చెప్పేసింది మాటే జారనని
మగవాడై...... తగిలావు...... ముడి వేసుకోక పోను......
వగలాడై...... రగిలావు..... సెగలణచకుండ వుండను ||నీ ఇల్లు||

No comments: