07 July 2010

రండి రండి రండి రండి దయచేయండి

రండి రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండి || రండి ||

నే చెప్పాగా నాన్నగారి తీరు
ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని ఉషారు
పలకరిపుతోటే మనసుమీటగలరు
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాసనగరు

తమరేనా సూర్య ఇలా కూర్చోండయ్యా
ఆగండి ఆగండి ఆగండి వద్దు కూర్చోకండి అక్కడ
తగిన చోటుకాదిది తమబోటి వారికి ఇక్కడ

ఈ గదిలో వాయిదాల వరాలయ్యా
గడపదాటి ఇటువస్తే వారి పేరు స్వరాలయ్య

క్లయింట్లు కంప్లైంట్లు క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు
తక్కిన నా గృహమంత గాన కళకు దర్బారు

రండి రండి రండి రండి దయచేయండి

తమరి రాక మాకెంతో సంతోషంసుమండి

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటు || 2 ||
చిర్రుబుర్రులాడటం కుర్చీలకు ఆచారం
ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం
వచ్చిన మిత్రులకోసం ముచ్చటగా వుంటుందని
సంగీతం పలికించే స్ట్రింగులతో చేయించా
కచేరిలు చేసే కుర్చియిది ఎలావుంది

బావుందండి

గానకళ ఇలవేల్పుగా వున్న మాఇంట
శునకమైన పలుకు కనకాది రాగాన
ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ
గాలైన కదలాడు సరిగమల త్రోవ

రావోయి రా, ఇదిగో ఈయనే సూర్య ఈమె నా భార్య
ఈ యింటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సు
ఆర్గుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సు

చాలులెండి సరసం యేళ్ళు ముదురుతున్న కొద్ది

తిడితే తిట్టేవు కాని తాళంలో తిట్టు
స్వరాలయ్య సంప్రదాయం కీర్తి నిలబెట్టు

పెడతా పొపెడతా పొగపెడతా పడకపెడతా
కొత్తవాళ్ళ ముందెటి వేళకోళం - ఎవరేమనుకుంటారో తెలియని మేళం

ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన
సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన

రండి రండి రండి రండి దయచేయండి
తరమరి రాక మాకెంతో సంతోషంసుమండి

వృద్ధాప్యంతో మంచంబట్టి తాళంతప్పక దగ్గడమన్నది
అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్య
ఖల్లు ఖల్లున వచ్చె చప్పుడు - ఘల్లు ఘల్లున మార్చే విద్య
కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడలమధ్య

ఇదిగో మా పనమ్మాయి దీని పేరు పల్లవి

దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం
మా ఇంట్లో సందడికి ఈపిల్లే మరి పల్లవి

రండి రండి రండి రండి దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషంసుమండీ

పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్
వావిలాల వరాలయ్య బిఎఎల్ఎల్బి పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్

మా ఇంటికి ముందున్నవి కావు రాతిమెట్లు
అడుగుపెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు
రండి రండి రండి రండి రండి రండి రండి రండి

మాకు నిలయ విద్వాంసులు చిలకరాజుగారు
కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరు

నవ్వు మువ్వకట్టి ప్రతినిముషాన్నీ తుళ్ళిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ
ఇదే మాధురి సుధమాధురి పంచడమే పరమార్ధం - అదే అదే నా సిధ్ధాంతం

గానమంటే ఒక కళగానే తెలుసు ఇన్నాళ్ళు నాకు
బ్రతుకు పాటగా మార్చినందుకు జోహారు ఇదిగో మీకు
సంగీతంలో మాటలాడటం
మాటలనే సంగతులు చెయ్యడం - సంగతులే సద్గతులు అనుకోవడం
సరిగా తెలుసుకున్నాను ఈనాడు
సెలవిప్పిస్తే వెళ్ళొస్తా - మళ్ళీ మళ్ళీ వస్తూవుంటా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips