పల్లవి
తక తక తక ధిమి తకతకతక
ధిమి తకతకతకధిమి తకజుం ||2||
కన్నులతో చూసేదీ గురువా ||కనులకు సొంతమవునా|| ||2||
కన్నుల్లో కనుపాపై నీవు నన్ను విడిపోలేవు
ఇక నన్ను విడిపోలేవు ||తక||
జలజల జంటపదాలు గలగల జంటపదా
ఉన్నవిలే తెలుగులో వున్నవిలో
విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు
రెండేలే రెండు ఒకటేలా ||ధినకుతాం||
చరణం 1
రేయి పగలు రెండయినా రోజు మాత్రం ఒకటేలే
కాళ్లు ఉన్నది రెండు వేరయినా పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండయినా ఆ ప్రేమమాత్రం ఒకటేలే||కన్నుల|| ||తక||
చరణం 2
కౌంఛ పక్షుల జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు వీడి మనలేవూ
కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రొండో దేడ్చును
పొంగేనా ప్రేమ చిందేనా ||ధినకు||
ఒక్కరు పోయే నిద్దరలో ఇద్దరు కలలను కంటుందా
ముక్కును పీల్చే శ్వాసలలో ఇద్దరు జీవనముంటుందా
దాని కొరకుమాత్రమే విడివిడిగా బ్రతుకుతున్నాం ||కన్నుల||
No comments:
Post a Comment