14 July 2010

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా

పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్ర జేసి మెరుపై మెరిసేనా
ఎల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా విరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా ||పిల్ల||

చరణం 1

మౌనాల వెనకాల.. వైనాలు తెలిసేలా.. గారంగా పిలిచేనా..
ఝల్లుమంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించనా
చంద్రజాలమై తరంగాల ఒడిలో యేళ్ళన్నీ మరిపించనా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయేనా
చందనాలు చిలికేలా ముంగిలిలో నందనాలు విరిసేనా ||అందరాని||

చరణం 2

నవ్వుల్లో హాయి రాగం.. మువ్వల్లో వాయు వేగం.. ఏమైందో ఇంత కాలం..
ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నొ పలికే సరికొత్త రాగాలుగా ఓ...
నింగిదాకా పొంగిపోయి హోరెత్తిపోతున్న గానాభజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా ||అందరాని||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips