12 July 2010

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే

ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే
హంపి లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి

ఖర్మకాలి రావణుండు నిన్ను చూడలేదుగాని సీత ఊసునే తలచునా పొరపడి
భీష్ముండున్న కాలమందు నువ్వు పుట్టలేదుగాని బ్రహ్మచారి గా ఉండునా పొరపడి
ఇంత గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి ఉంటే పాత యుద్ధ గాధలన్నీ మారియుండేవే (2)
పొరపాటు బ్రహ్మది కాని సరిలేనిదీ అలివేణి
వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే
హంపి లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావో ఏమో వయ్యారి
వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తీనే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే

అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు గనక వెళ్ళిపొయెనే చల్లగా ప్రవరుడు
వరూధినిని కాక నిన్నే వలెసుంటె కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడు
ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరు కాపురాలు గంగకొదిలి వెంటపడతారే(2)
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన

No comments: