20 July 2010

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు

పల్లవి

పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు
నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావో!
మనసు పెనవేస్తే ఏమౌతావో

ఉలికిపాటుతోనే పులకరించిపోతావు
నేను ఔనంటే ఏంచేస్తావో
కాదు పొమ్మంటే ఏమౌతావో

చరణం 1

మొలక నడుము ఇయలు చూసి మురిసిపోదును
జిలుగుపైట నీడలోన పరవశించును ||మొలక||
సొగసు వెనక నడయువయలు చూడనీయ్యను||2||
కడకొంగున నిను బిగించి నడచిపోదునూ || పలక ||

చరణం 2

పువ్వునై కురులలో పొంచి వుందును
నవ్వునై పెదవీపి పవళింతును ||2||
పూలతో నిన్ను కూడ ముడుచుకొందును ||2||
పెదవిపైన ఒదిగి నిన్ను కదలనియ్యను ||పలక||

చరణం 3

కలలోనైన నిన్ను నేను కలుసుకుందును
దొంగనై దోరవలపు దోచుకొందును ||2||
చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును ||2||
తొలివలపుల తియ్యదనం తెలపమందును ||పలక||

No comments: