02 July 2010

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి

మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
మరుమల్లి జాబిల్లి ఒకటయితే మా చెల్లి
మన్మధుని రాఘవుని కలబోతే బావ అని
ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి
ఇంటిపేరు మర్చే పెళ్ళి జంటనడక పెళ్ళి
బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమయి జరుగుతున్న పెళ్ళి
బహుమానంగా ఆశీస్సులనే అడుగుతున్న పెళ్ళి

దేవుళ్ళు దేవతలు కొలువయిలేరు కొవెలలో
బంధువులై చుట్టాలై విచ్చేసినారు వాకిలిలో
ఊరు వాడా వేడుకా ప్రతి ఒక్కరి హౄదయం వేదిక
లేనే లేదు తీరికా ప్రతి నిమిషం తెలియని తికమకా
మైనాలు కోయిలలు కూర్చోలేదు కొమ్మలలో
మా వాళ్ళై అయినోళ్ళై ఒక చెయ్యేసినాయి మేళంలో
పందిరిలోన పండుగలన్ని నిలుపుతున్న పెళ్ళి
నవ్వులలోన కన్నుల తడిని కలుపుతున్న పెళ్ళి

మా నాన్నా మా అన్న ఇద్దరు నాకు పుట్టిళ్ళు
అందరికి సెలవంటు నేవెళ్ళి వొస్తా అత్తిళ్ళు
చల్లని చూపే కాటుకా ఇక తరగని ప్రేమే బొట్టుగా
మమకారాలే సిరులుగా మెట్టింట్లో ఉంటా సీతగా
ఆత్రాన్నయి సూత్రన్నయి ముద్దుగా వెస్తా బంధాలు
నేస్తాన్నయి నీ వాడ్నై నీ వద్ద వుంటా వందేళ్ళు
మాటలు కలిసే మనసులు కలిసే ముచ్చటయిన పెళ్ళి
కలిసిన మనసె శక్షిగా నిలిచే స్వచ్చమయిన పెళ్ళి

No comments: