06 July 2010

కోకిలమ్మా బడాయి చాలించు

కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ
వినీల జిక్కి లోన వర్షించు పూలవాన
అశా లత ల లోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

ఒకే పదం ఒకే విధం కుహు కుహు
అదే వ్రతం అదే మతం అనుక్షణం
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మా చరిత్ర మర్చుకోమ్మా
శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మా
ఖరీదు కాదు లేమ్మా
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా..ఆ
మా ఊరిలొ కచేరిలో పడాలి గా హా ఆ...
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మా
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మా
దమ్ములుంటే నా పైన నెగ్గవమ్మా
అదంతా తేలికెమి కాదులెమ్మా
ఎత్తాలి కొత్త జన్మ
కోకిలమ్మా బడాయి చాలించు
మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips