10 July 2010

క్రిష్ణానగరే మామా.. క్రిష్ణానగరే మామా !!

క్రిష్ణానగరే మామా.. క్రిష్ణానగరే మామా !!
సినిమాలే లైఫుర మామా... లైఫంతా సినిమా మామా..
ఎటు చూసిన కలలే మామా కడతేరని కధలే మామా..
పని ఉంటే మస్తుర మామా లేదంటే పస్తుర మామా...
కన్నీళ్ళు ఉన్నా.. కష్టాలు ఉన్నా.. సంతోషమేరా...
ఈ దారిలోనా...ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమే రా...
ఛలో ఛలో చెయ్ కలపర మామా తాడో పేడో తేల్చేద్దాం మామా
అణుక్షణమ్ ఇక స్ట్రగులే మామా అయిన సరే వదిలెళ్ళం మామా

క్రిష్ణానగరే మామా.. క్రిష్ణానగరే మామా !!
సినిమాలే లైఫుర మామా... లైఫంతా సినిమా మామా..

ఓ ఎన్నెన్నో ఆశలున్నవీ ఏవేవో ఊహలున్నవీ..
బ్లడ్డంతా సినిమా సినిమని మెలిపెట్టి చంపుతున్నదీ...
కన్నవారినీ ఉన్న ఊరుని ఉన్నపాటుగా వదిలేసొచ్చాం
పిచ్చి పిచ్చి గా నచ్చి నచ్చి ఈ సినీఫీల్డ్ లో దూకేసాం
ఏం మోసాలు చెయ్యం ఏం నేరాలు చెయ్యం
ఏ ఘోరాలు చెయ్యమ్ ఏ మాకేంటి భయ్యం
తిండున్నా లేకున్నా మాకేనాడు ప్రాబ్లం కాదే
సెట్లో లైటేస్తే మా కడుపు నిండిపోద్దే
ఒన్డేలో స్టారంటే అది చూసేంత వీజీ కాదే
ఏళ్ళో ఎన్నేళ్ళో కన్నీళ్ళ కష్టముందే...

క్రిష్ణానగరే మామా.. క్రిష్ణానగరే మామా !!
సినిమాలే లైఫుర మామా... లైఫంతా సినిమా మామా..

షూటింగే జరిగినప్పుడూ ప్రతి రోజూ పెళ్ళిసందడే...పెళ్ళిసందడే...
సినిమా పూర్తయ్యినప్పుడూ అందరికీ అప్పగింతలే.. అప్పగింతలే...
కోడి కూతకీ గంట ముందుగా నిద్ర లేవడం మాకే సొంతం
వానలొచ్చినా వరదలఒచ్చినా టైముకెప్పుడూ మేముంటాం
యాక్టింగు చేస్తాం మేం,,ఫైటింగుచేస్తాం మేం..
మ్యూజిక్కు చేస్తాం మేం మ్యాజిక్కూ చేస్తాం...
మతిపోయే టాలెంటూ మాలోనే ఉందిర భాయీ...
ఏదో ఓ రోజూ అది బయటపడతదోయీ..
సరదాకీ మీరంతా మా సినిమాలే చూస్తారండీ
అయినా మేమంటే ఓ చిన్న చూపులేండీ...

క్రిష్ణానగరే మామా.. క్రిష్ణానగరే మామా !!
సినిమాలే లైఫుర మామా... లైఫంతా సినిమా మామా..

No comments: