06 July 2010

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశలరెక్కల హంసల పల్లకి మొసుకు పోవలెనే
ఆశలరెక్కల హంసల పల్లకి మొసుకు పోవలెనే
మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగి వచ్చులే
ఆ ఆ ఆ ఆ ఆ

ముద్దుల

నింగిని తాకే పందిరివేసి పచ్చని పల్లెను పీటగా చేసి
నింగిని తాకే పందిరివేసి పచ్చని పల్లెను పీటగా చేసి
బంగారు రంగులు వేయించరారె మురిపాల పెళ్ళి జరిపించరారే
వధువు సోగసంతా మెరిసే వలపు మదిలోనా విరిసే
చిలిపి కోరికలు కురిసే పడుచు పరువాల ఎగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగా కనిపించే
ఆ ఆ ఆ ఆ ఆ

ముద్దుల

తూరుపు ఎరుపై మనసులు పాడే గోదావరిలా మమతలు పోంగె
తూరుపు ఎరుపై మనసులు పాడే గోదావరిలా మమతలు పోంగె
రాయంచలన్ని రాగాలు తీసే చిలకమ్మలెన్నో చిత్రాలు చేసె
కదివిరావమ్మ నేడే కలలు పండెటి వెళ
వేచి వున్నాడే వరుడే కంటి సరసాల కేలా
సరసకు వయసున ఒంపుల సోంపుల సరిగమని వినిపించే
ఆ ఆ ఆ ఆ ఆ

ముద్దుల

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips