12 July 2010

చిన్ని పాదాల చినుకమ్మా

చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా
మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా
చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా

అదుపులేని పరుగా ఇది కదలలేని పదమా ఇది
ఏమోమరి నీ సంగతి
కలల లయల పిలుపా ఇది చిలిపి తలపు స్వరమా ఇది
ఏమోమరి యద సవ్వడి
మాటైన రానంత మౌనాలా ఏ బాషకి రాని గానాలా
మన జంటె లోకంగ మారాలా మన వెంటే లోకాలు రావాలా
బదులియ్యవా ప్రణయమా

శ్వాస వేణువై సాగినా వేడి వేసవై రేగినా
భారం నీదే ప్రియ భావమా
ఆశకి ఆయువై చేరినా కలల వెనకనే దాగినా
తీరం నువ్వే అనురాగమా
దూరాన్ని దూరంగ తరిమేసి ఏకాంతమే ఏలుతున్నామా
ఊహల్లో కాలాన్ని ఉరివేసి గాలుల్లో ఊరేగుతున్నామా
తెలిసేనా ఓ ప్రియతమా
చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందిచేదెప్పుడమ్మా
మువ్వై నువ్వు నాలో నవ్వేదెప్పుడమ్మా
చిన్ని పాదాల చినుకమ్మా స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా మంచి ముచ్చట్లు పలుకమ్మా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips