23 July 2010

శంకరా ఆ ఆ ఆ నాద శరీరాపరా

పల్లవి:

శంకరా ఆ ఆ ఆ నాద శరీరాపరా
వేదవిహారా హరా జీవేశ్వర
శంకరా నాద శరీరాపరా
వేదవిహారా హరా జీవేశ్వర
శంకరా

చరణం1:

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమనీ
ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమె గానమనీ
మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమనీ
నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
ధిక్కరింద్రజిత హిమగిరీంద్ర సిత కందర నీల కందరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవతరించరా విని తరించరా
శంకరా నాద శరీరాపరా
వేదవిహారా హరా జీవేశ్వర శంకరా ఆ ఆ ఆ

చరణం2:

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివ గంగ
పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివ గంగ
నా గానలహరి నువ్వు మునుగంగ
ఆనంద వృష్ఠి నే తడవంగా
ఆ ఆ ఆ ఆ
శంకరా నాద శరీరాపరా
వేదవిహారా హరా జీవేశ్వర శంకరా శంకరా శంకరా

2 comments:

చాణక్య said...

క్షమించాలి..రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా.

keerthika karlapudi said...

chanakya garu thanx for correcting us..