పల్లవి:
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఎలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో చేరి ఎలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఎమి కోరిక
చరణం1:
రా దొర ఒడి వలపుల చెరసాలరా
లే వరా ఇవి దొరకని సరసాలురా
దోర దోర సోకులేవి దోచుకో సఖా
ఋతువే వసంతమై పువ్వులు విసరగా
ఎదలే పెదవులై సుధలే కొసరగా
ఇంత పంతమేల బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఎలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
చరణం2:
నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి
నీ కసి స్వరమెరుగని ఒక జావళి
లేత లేత వన్నెలన్ని వెన్నెలేనయా
రగిలే వయసులో రసికత నాదిరా
పగలే మనసులో మసకలు కమ్మెరా
ఇంక బింకమేల బాలాకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
కోరుకో కోరి చేరుకో చేరి ఎలుకో బాలకా
కోరుకో కోరి చేరుకో చేరి ఎలుకో బాలకా
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
నరుడా ఓ నరుడా ఏమి కోరిక
No comments:
Post a Comment