21 July 2010

ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా--Keelu Guram

పల్లవి:

ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట సిద్ధమన్న
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట సిద్ధమన్న

చరణం1:

రాముడంతటివాడు రమణి సీతను బాసీ
రాముడంతటివాడు రమణి సీతను బాసీ పామరునివలె ఏడ్చెనన్నా
రాముడంతటివాడు రమణి సీతను బాసీ పామరునివలె ఏడ్చెనన్నా పామరునివలే ఏడ్చెనన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవింపక ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట సిద్ధమన్న

చరణం2:

ఆనాటి పాండవులు ఆకులలములుమేసి అడవిపాలైపోయిరన్నా
ఆనాటి పాండవులు ఆకులలములుమేసి అడవిపాలైపోయిరన్నా
కడుపుపగిలేటట్టు కుడుములూ నేతింటే
కడుపుపగిలేటట్టు కుడుములూ నేతింటే
కడుపొరులకెట్లొబ్బురన్నా
కడుపొరులకెట్లొబ్బురన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట సిద్ధమన్న

చరణం3:

కడివెడుతీర్ధము కడుపార నేదాగ కళ్ళెర్ర మీకెందుకన్నా
కడివెడుతీర్ధము కడుపార నేదాగ కళ్ళెర్ర మీకెందుకన్నా
నా ఒళ్ళుబరువుకూ నే ఏడ్వవలెకాని ఒరులెందుకేడ్తురో రన్నా
నా ఒళ్ళుబరువుకూ నే ఏడ్వవలెకాని ఒరులెందుకేడ్తురో రన్నా ఒరులెందుకేడ్తురో రన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట సిద్ధమన్న
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట సిద్ధమన్న అనిభవించుట సిద్ధమన్న అనిభవించుట సిద్ధమన్న

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips