21 July 2010

హే జనని కృష్ణవేణి--krishnaveni

హే జనని కృష్ణవేణి
రాజిత తరంగవాణి
పంచ పాతక హారిణి
పరమ మంగళకారిణి
దక్షినోర్వి దివ్యవాహిని
అక్షీణ భాగ్య ప్రదాయిని
శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంశేవిని
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని
కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని
కృష్ణవేణి కృష్ణవేణి మమ: ప్రశీద, మమ: ప్రశీద

పల్లవి:

కృష్ణవేణి కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

చరణం1:

శ్రీగిరిలోయల సాగే జాడల
శ్రీగిరిలోయల సాగే జాడల
విద్యుల్లతలు కోటి వికశింపజేసేవు
లావణ్యలతవై నను చేరువేళ
లావణ్యలతవై నను చేరువేళ
శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

చరణం2:

నాగార్జున గిరి కౌగిట ఆగి
నాగార్జున గిరి కౌగిట ఆగి
బీళ్ళను బంగారు చేలుగా మార్చేవు
ఆంధ్రావనికై అన్నపూర్ణవై కరువులు బాపేవు,బ్రతుకులు నిలిపేవు
నా జీవనదివై ఎదలోన ఒదిగి
నా జీవనదివై ఎదలోన ఒదిగి
పచ్చని వలపులు పండించు కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

చరణం3:

అమరావతి గుడి అడుగుల నడయాడి
అమరావతి గుడి అడుగుల నడయాడి
రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు
ఏ శిల్ప రమణులు , ఏ దివ్య లలనలు
ఏ శిల్ప రమణులు , ఏ దివ్య లలనలు
ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి

చరణం4:

అభిసారికవై హంసలదీవిలో
సాగర హృదయాన సంగమించేవు
నా మేని సగమై నా ప్రాణసుధవై
నా మేని సగమై నా ప్రాణసుధవై
నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి
కృష్ణవేణి తెలుగింటి విరివోణి
కృష్ణవేణి నా ఇంటి అలివేణి

No comments: