21 July 2010

శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్య--krishnaveni

పల్లవి:

శ్రీశైలా మల్లయ్య
శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్య
శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా
శ్రీశైలా మల్లయ్య

చరణం 1:

ఇదియే దక్షిణ కైలాసము ,ఇది నాగార్జున నివాసం
ఇదియే దక్షిణ కైలాసము ,ఇది నాగార్జున నివాసం
ఇందున్న శిలలే
ఇందున్న శిలలే శివలింగాలు,సెలయేళ్ళన్ని దివ్యతీర్థాలు
శ్రీశైలా మల్లయ్య

చరణం 2:

వరుస వేదుల రాశి ప్రత్యక్ష కాశీ ,పాతాళ గంగకు కాణాచి
వరుస వేదుల రాశి ప్రత్యక్ష కాశీ ,పాతాళ గంగకు కాణాచి
ఈ శిఖర దర్శనమే
ఈ శిఖర దర్శనమే పాపహారము ,భక్త కోటికి జన్మ పావనము
శ్రీశైలా మల్లయ్య

చరణం 3:

పర్వతుడు నిను గొల్చి మెప్పించగా,చంద్రవతి మల్లెపూల పూజింపగా
పర్వతుడు నిను గొల్చి మెప్పించగా,చంద్రవతి మల్లెపూల పూజింపగా
మల్లిఖార్జున రూపమై
మల్లిఖార్జున రూపమై నిలిచావులే,తెలుగు గడ్డకు ముక్తి నిచ్చావులే

శ్రీశైలా మల్లయ్య
శ్రీశైలా మల్లయ్య దైవమే నీవయ్య
శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా
శ్రీశైలా మల్లయ్య

1 comment:

చాణక్య said...

entandi keerthika garu, nimishaaniko paata post chestunnaru..? you are very fast. keep up it up. all the best.