21 July 2010

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది---vurantha sankranthi

పల్లవి:

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

చరణం1:

అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి గంధాలు పూసేను
అరెరెరెరె లోగిల్లలోన సిగ్గులన్ని వెల్లలేసె ప్రేమ రంగులేసె
కన్నెపిల్లలో సోకు పండిందని సాకు కావాలని తోడు రావాలని
అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి గంధాలు పూసేను
ఆ ఆ ఆ అల్లీ అల్లని పందిట్లో అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

చరణం2:

వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను
సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను
కల్లల్లోని ఆశలన్ని కొండాకొచ్చి వెయ్యి ముడుపులిచ్చి
గుండె చాటు కలలన్ని తీరాలని వలపు సాగాలని రేవు చేరాలని
వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను
సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను
నవ్వీ నవ్వని నవ్వుల్లో తెలిసి తెలియని ఒరవళ్ళు
కలిసీ కలవని కళ్ళల్లో తీరి తీరని ఆకళ్ళు
తీరే రోజు రేపోమాపో రావాలని

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips