04 December 2010

చందమామా చందమామా సింగారాల చందమామా

చందమామా చందమామా సింగారాల చందమామా
చందమామా చందమామా సింగారాల చందమామా
చందమామా చందమామా సాయంత్రాల చక్కనమ్మా
వస్తావాకలిసొస్తావాకవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగీ నేల తాళాలేసే మేళాలెన్నడో
నిన్నూ నన్నూ ఊరేగించే మేఘాలెక్కడో

చందమామా చందమామా సింగారాల చందమామా

కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు తెల్ల ముగ్గు వేసుకుంటాలే
వీటికంటా రేగే మంటా చేస్తే ఉంటా నిన్నే జంటా చేసుకుంటాలే

ఊరించేటి అందాలన్నీ ఆ ఆ ఆ
ఊరించేటి అందాలన్నీ అరేసాక ఆరాతీసా
చీకట్లోని చిన్నందాలా చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయీ దాయి దాటి పోనీకులే

చందమామా చందమామా సింగారాల చందమామా

తుళ్ళీంతాడే గోదారల్లే ఏరూ నీరూ నీవూ నేనై పొంగిపోదామా
ఆ ఆ చుక్క కళ్ళ నీలాకాశం జబిల్లమ్మ జాడే ఉంటే పున్నమై పోదా
మల్లెగాలి పాడే లాలీ ఆ ఆ ఆ
మల్లెగాలి పాడే లాలీ గిల్లీ గింత పెట్టే వేళా
సన్నా జాజి సయ్యాటల్లో కన్నె మోజు చూసాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా అవుతా నీ జంటా
చెయి చేయి చేయి దాటి పోనీకు వాయీ

చందమామా చందమామా సింగారాల చందమామా

చందమామా చందమామా సాయంత్రాల చక్కనమ్మా
వస్తావాకలిసొస్తావాకవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా మనసిస్తావా కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగీ నేల తాళాలేసే మేళాలెన్నడో
నిన్నూ నన్నూ ఊరేగించే మేఘాలెక్కడో

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips