ఎవరేమైనా అనని వినకు
నువ్వేరా అమ్మ కన్నుల వెలుగు
ఎండల్లో వానల్లో నేనేగా నీ గొడుగు
చూస్తుంది లోకం మెచ్చి నువు వేసే ప్రతి అడుగు
పదితలలున్నా..... ఏమిటి లాభం....
తలపులు రాక్షసమైతే.......
పై మాటలతో.... పనేముందిరా.......
నువ్వే రాముడివైతే......
తుడుచుకోరా కన్నీళ్ళనీ
చెరుపుతాయి నీ నవ్వుని
దిద్దుకోరా ఈ మాటని
నీకునువ్వే సాటి అని
ఎంతో దూరం.... ఎగరలేదుగా....
తన రెక్కలతో పక్షి
చుక్కల దాకా... ఎదుగుతాడురా....
అసలెగరలేని మనిషి
అమ్మ పైన నీ నమ్మకం
నిలుపుతుంది నిన్నెప్పుడో
అందరాని అంతెత్తున
అంబరాన ధృవతారలా
No comments:
Post a Comment