04 June 2010

మౌనం మనసున మంటలై రగిలి మరిగిపోతున్నది

మౌనం మనసున మంటలై రగిలి మరిగిపోతున్నది
ప్రాణం పోయే బాధతో గుండె కొట్టుకుంటున్నది
గొంతే అందని ప్రేమ కేక ఊపిరిని కోస్తున్నది
దారే తోచక చూపు చీకటిని కమ్ముకుంటున్నదీ

అణువణువునా ఆవేదనావినిపించనీ ఆలాపనా
ఆవేశమై..నా శోకమై ముంచేయగా..నను నిలువునా
ఎటు చూసినా ఏం చేసినా నను వీడదే ఆరాధనా
నువు దూరమై ఎద భారమై మరణించునే ఆలోచనా

ఎన్ని రాగాలు ఎన్ని భావాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని సత్యాలు
ఎలా ఇంతలోనే మరచినావే నేస్తమా !

ఎన్ని మోహాలు ఎన్ని విరహాలు ఎన్ని కలయికలు ఎన్ని సాక్ష్యాలు
ఎలా నమ్మలేదో నన్ను నీవే తెలుపుమా !

కదిలే క్షణాలు భారమై నన్ను కదలనీకుండ కట్టేస్తుంటే..
ఏకాకిలాగ మిగిలానులే
గుండెనే కాల్చు మంటలే ఎగసి..కనుల క..న్నీటిలోతడిమి తా..గేసినా
మనసెంతగా ఏడ్చినా తెలియదే..ఓ ఓ ప్రేమా !

మౌనం మనసున మంటలై రగిలి మరిగిపోతున్నది
ప్రాణం పోయే బాధతో గుండె కొట్టుకుంటున్నది
గొంతే అందని ప్రేమ కేక ఊపిరిని కోస్తున్నది
దారే తోచక చూపు చీకటిని కమ్ముకుంటున్నదీ

కనుమూస్తె చాలు నీ జ్ఞాపకాలు
కనిపించి కంటి తెరపై నన్ను కలతలై లేచి వెంటాడగా
బాసలే ఆవిరైపోతుంటే చీకటే ముసిరెనే వెలుతురే ఆరెనే
నను శూన్యమే నిలువునా మింగెనే .. ఓ ఓ ప్రేమా !

మౌనం మనసున మంటలై రగిలి మరిగిపోతున్నది
ప్రాణం పోయే బాధతో గుండె కొట్టుకుంటున్నది
గొంతే అందని ప్రేమ కేక ఊపిరిని కోస్తున్నది
దారే తోచక చూపు చీకటిని కమ్ముకుంటున్నదీ

అణువణువునా ఆవేదనా వినిపించనీ ఆలాపనా
ఆవేశమై..నా శోకమై ముంచేయగా..నను నిలువునా
ఎటు చూసినా ఏం చేసినా నను వీడదే ఆరాధనా
నువు దూరమై ఎద భారమై మరణించునే అలోచనా

ఎన్ని రాగాలు ఎన్ని భావాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని సత్యాలు
ఎలా ఇంతలోనే మరచినావే నేస్తమా !

ఎన్ని మోహాలు ఎన్ని విరహాలు ఎన్ని కలయికలు ఎన్ని సాక్ష్యాలు
ఎలా నమ్మలేదో నన్ను నీవే తెలుపుమా !

No comments: