మువ్వగోపాలా..ముద్దు కావాలా
దరికి రావేలా..కలికి ఓ బాలా
కన్నుల్లో వెన్నెల కావాలా.. వెన్నెల్లో వేణువు నవ్వాలా..
వేణువులో రాగం పలికేలా నీ పెదవిని తాకాలా
కమ్మంగా కౌగిలి కావాలా..కౌగిట్లో కరిగీ పోవాలా
కవ్వించే వన్నెల గిన్నెల్లో నీ వెన్నెల తాగాలా
మువ్వగోపాలా..ముద్దు కావాలా
దరికి రావేలా..కలికి ఓ బాలా
పెదవులు పలికే పల్లవి ప్రేమా
పెదవులు పలికే పల్లవి ప్రేమ..
ఎదలను మోసే పల్లకి ప్రేమ
మూగగ పిలిచీ హాయిని కలిపీ
మాటను నేర్పును ఈ ప్రేమా
నవ్వించేదీ ప్రేమా..పాపలాంటి ప్రేమా..
కలలా కలిసీ కన్నుల వొడిలో నిదురించే ప్రేమా !
మురిపించేటీ ప్రేమా..మూకీ చిత్రం ప్రేమా..
ఇష్ఠం అంటూ వెంటొస్తుందీ వద్దూ పొమ్మన్నా !
మువ్వగోపాలా..ముద్దు కావాలా
దరికి రావేలా..కలికి ఓ బాలా
రాగము తీసే కోయిల ప్రేమా
రంగులు పంచే రైన్ బో ప్రేమా
వినిపిస్తుందీ కనిపిస్తుందీ
విడలేనంటూ ఈ ప్రేమా !
ఆరాధించే ప్రేమా ఆలాపించే ప్రేమా
ఆరేళ్ళైనా నూరేళ్ళైనా తలచును ఈ ప్రేమా !
కులమే లేనిది ప్రేమా ఏ మతమూ లేనిది ప్రేమా
ఒకటే మంత్రం పలికిస్తుంది ప్రేమాయనమః
మువ్వగోపాలా..ముద్దు కావాలా
దరికి రావేలా..కలికి ఓ బాలా
కన్నుల్లో వెన్నెల కావాలా..
వెన్నెల్లో వేణువు నవ్వాలా..
వేణువులో రాగం పలికేలా నీ పెదవిని తాకాలా
కమ్మంగా కౌగిలి కావాలా..కౌగిట్లో కరిగీ పోవాలా
కవ్వించే వన్నెల గిన్నెల్లో నీ వెన్నెల తాగాలా
మువ్వగోపాలా..ముద్దు కా..వా..లా
దరికి రావేలా..కలికి ఓ బాలా
No comments:
Post a Comment