04 June 2010

ఏలే ఏలే మరదలా

ఏలే ఏలే మరదలా
వాలే వాలే వరసలా
నచ్చింది నచ్చింది నాజూకు
నీకే ఇస్త సోకులు
ఇచ్చేయి పచ్చని సొగసులు
చాలు నీ తోటి
అహ చాలు నీ తోటి సరసాలు బావ

గాటపు గుబ్బలు కదలగ కులికేవు మాటల తేటల మరదల
వేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా
చీటికి మటికి చెనకేవు
చీటికి మటికి చెనకేవు వట్టి బూటకాలు మాని పోవే బావ
చాలు చాలు నీతోటి అహ చాలు నీ తోటి సరసాలు బావ

కన్నుల గంటపు కవితలు గిలికేవు నా ఎద చాటున మరదలా
పాడని పాటల పయిటలు సరిదేవు పల్లవి పదముల దరువుల
కంటికి వంటికి కలిపేవు
కంటికి వంటికి కలిపేవు ఎన్ని కొంటె లీలలంట కోలో బావ
అహ పాడుకో పాట జంట పాడుకున్న పాట జాజిపూదోట

No comments: