07 June 2010

డుం డుం డుం నటరాజు ఆడాలి

డుం డుం డుం నటరాజు ఆడాలి..... పంబ రేగాలిరా
జండాపై కపిరాజు ఎగరాలి..... నేల జాబిల్లిలా
గుండెల్లో గురిఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా
నీమాటే నీబాటై సాగాలి సూటిసూరీడుగా
పామాట నుంచి భామాట దాకా నాదేనురా సయ్యాట
ఆడితప్పని మాట అయ్యచూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నాప్రాణం ||డుం డుం||

అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా
బ్రమ్హన్నపుత్రా హే బాలచంద్రా చెయ్యెత్తి జేకొట్టరా
పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా
వేసంగిలోన పూసేటి మల్లి నీమనసు కావాలిరా
అరె వెలిగించరా లోని దీపం......అహ తొలగించరా బుద్ధిలోపం
ఒహొ ఆత్మేరా నీజన్మ తారా...... సాటి మనిషేర నీపరమాత్మ ||డుం డుం||

చూపుంటె కంట్లో ఊపుంటె ఒంట్లో నీకేంటి ఎదురంట
చూపుంటె కంట్లో ఊపుంటె ఒంట్లో నీకేంటి ఎదురంట
నీవు నీకు తెలిసేలా నిన్ను నీవు గెలిచేలా మార్చాలిరా మనగీత
చిగురంత వలపో చిలకమ్మ పిలుపో బులబాటం ఉండాలిరా
పెదవుల్లో చలి ఈల పెనవేస్తే చెలిగోల చెలగాటమాడాలిరా
అహ మారిందిరా పాతకాలం.... నిండుమనసొక్కటే నీకు మార్గం ||డుం డుం||

No comments: