ఏ కొమ్మకాకొమ్మ కొంగొత్త రాగం తీసిందిలే కోయిల
సుమ గీతాల సన్నాయిలా
ఏ పువ్వుకాపువ్వు నీ పూజకోసం పూసిందిలే దివ్వెలా
నీ పాదాలకే మువ్వలా
ఒక దేవత దివిదిగి వచ్చె ప్రియనేస్తంలాగా
ఎద గూటికి అతిధిగ వచ్చె అనుబంధంకాగా
మనసాయె మంత్రాలయం
ఇది స్నేహాల దేవాలయం ||ఏ కొమ్మ||
ఆకాశదేశాన దీపాలు స్నేహాల చిరునవ్వులు
నా నావ కోరేటి తీరాలు స్వర్గాల పొలిమేరలు
మమతల మధు మధురిమలిటు సరిగమలాయే
కలబడు మన మన్సుల కలవరమై పోయే
గాలుల్లొ గంధాలు పూలల్లొ అందాలు
జతచేయు హస్తాక్షరి
అభిమానాల అంత్యాక్షరి ||ఏ కొమ్మ||
ఎన్నాళ్ళు ఈ మూగభావాలు సెలయేటి తెరచాపలు
నాలోని ఈ మౌనగీతాలు నెమలమ్మ కనుపాపలు
కుడియెడమల కుదిరినకళ యెదటెదుటాయే
ఉలి తగిలిన శిల మన్సున సొద మొదలాయే
ఈ సప్తవర్ణాల నా స్వప్నరాగాల
పాటల్లొ ప్రధమాక్షరి
దివి ప్రాణాల పంచాక్షరి ||ఏ కొమ్మ||
No comments:
Post a Comment