నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీపాదాలే రసవేదాలు నను కరిగించే నవనాదాలూ
అవి ఎదలో ఉంచిన చాలూ ఏడేడు జన్మాలూ..
ఆ.ఆ..ఆ..ఆ
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం ||2||
నీపాదాలే రసవేదాలు నను కరిగించే నవనాదాలూ
అవి ఎదలో ఉంచిన చాలూ ఏడేడు జన్మాలూ..
మువ్వలు పలికే మూగతనంలో..మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు ||2||
అంగ అంగమున అందచందములు.. ఒంపు ఒంపున హంపి శిల్పములు |2|
ఎదుట నిలిచిన చాలూ...ఆరారు కాలాలూ
||నీ చరణం ||
జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
కృతులే కలిసే రాగతనంలో పల్లవించినా పరువాలు ||2||
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు |2|
ఎదురై నిలిచిన చాలు..నీ మౌనగీతాలు..
No comments:
Post a Comment