హహ హా..హా..హ.హ అహ్హ అహా హా.అ హా..
ఆ..ఆ..ఆ..హహా
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా
రోజు రోజు రోజు రోజూ పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దుపెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నువ్వా
పడుచుతనపు గడుసువలపు పాటవు నువ్వా వావా
చక్కదనానికి చెక్కిలిగింతవు నువ్వా నువ్వా కందే పువ్వా కన్నే పువ్వా
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా ఆ..ఆ.
ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా
గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా
No comments:
Post a Comment